మినీ గురుకులం పాఠశాల విద్యార్థులకు వైద్య పరీక్షలు.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వాజేడు మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం వైద్యాధికారి ఆధ్వర్యంలో జంగాలపల్లి మినీ గురు కులంలో వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థుల కు పరీక్షలు చేసి దగ్గు, జలుబు, జ్వరాలను గుర్తించి మందులు పంపిణీ చేశారు. అదేవిధంగా పీహెచ్సీ పరిధిలోని అరుణా చలపురం, పూసూరు పాఠశాలల విద్యార్థులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, రక్తపూత నమూనలు సేకరించారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ మధుకర్ ,సి హెచ్ ఓ. సూర్య ప్రకాష్ రావు, హెల్త్ సూప ర్వైజర్స్ వెంకటరమణ, కుప్పిలి కోటిరెడ్డి , ఏఎన్ఎం. ఛాయాదేవి, హెల్త్ అసిస్టెంట్ చిన్న వెంకటేశ్వర్లు, ఎల్ టి రజినీ కాంత్, హాస్టల్ వార్డెన్స్, టీచర్స్, ఏఎన్ఎం శకుంతల, ఆశా కార్య కర్తలు అక్కమ్మ, సరిత, పద్మ, లక్ష్మి, రమణ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.