తుఫాను ప్రభావంతో మిర్చి, వరి పంటలకునష్టం.
– మిర్చి తోటలలోకి,వరి పొలాలలోకి చేరిన వర్షపు నీరు.
– రైతాంగం ఆందోళన.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా, ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో పల్లపు ప్రాంతాలు జలమయ మయ్యాయి. వేల ఎకరాల్లో సాగు చేస్తున్న మిర్చి పంట తోటల్లోకి వర్షపు నీరు చేరటంతో,పాటు వర్షపు నీరు బయటకు వెళ్లే పరిస్తితి లేక మొక్కలు చనిపోయే అవకాశం ఉందని మిర్చి రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి మిర్చి మొక్కలు ఎదుగుదల పూత, పిందె దశలో వున్న తోటలకు తుఫాను ప్రభావం తో రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. అలాగే ఖరీఫ్ వరి పంట కోతల దశలో భారీ వర్షాలు కారణంగా పంట చేతికి వచ్చే సమయంలో, వరి గాలివర్షాలకు నేలకు ఒరిగిపోయిం ది. ముందుగా వరి పొలాలు కోసిన రైతులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఆరబోసుకొని, దాన్యపు రాసులు తడవకుండా ప్లాస్టిక్ బరకాలు పట్టుకొని పరుగులు తీస్తున్నారు. మబ్బులు కమ్మిన ఆకాశం, ఎడతెరిపిలేని వర్షాలు కారణంగా జనజీవనం స్తంభించి పోయింది. బుధవారం సాయంత్రం కొద్దిసేపు వర్షం ఆగిపోవడంతో ప్రజలు నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు, కూరగాయ లు, నిత్యవసర వస్తువుల దుకాణాల వైపు పరుగులు తీశారు. భారీ వర్షాలతో గత రెండు రోజులుగా ప్రజలు ఇళ్ళు నుండి బయటకు రాకపోవడంతో, జనజీవనం స్తంభించిపోయింది.