ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు క్యాబినెట్లో మంత్రి పదవి ఇవ్వాలి
– అధిష్టానాన్ని కోరిన కుర్మ సంఘ ములుగు జిల్లా కార్యదర్శి
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఆలేరు నుంచి భారీ మెజార్టీతో గెలిచిన బీర్ల ఐలయ్యకి క్యాబినెట్లో పోస్ట్ ఇచ్చి కురుమ సంఘ అభివృద్ధికి తోడ్పడాలని కాంగ్రెస్ అధిష్టానాన్ని ములుగు జిల్లా కురుమ సంఘ కార్యదర్శి ఎలుకపల్లి శ్రీనివాస్ కోరారు. కాంగ్రెస్ పార్టీ కురుమ సంఘానికి తెలంగాణ రాష్ట్రంలో రెండు ఎమ్మెల్యే టికెట్లు కేటాయించినందుకు కురుమ సంఘం నుండి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు. కురుమ ఐలయ్యకి అధిష్టానం మంత్రి పదవి ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో కురుమ సంఘం కాంగ్రెస్ ప్రభుత్వానికి అన్ని జిల్లాల నుంచి మద్దతు తెలుపుతామన్నారు. ఈ కార్యక్రమంలో సుంక శ్రీనివాస్, ఏటూరునాగారం కుర్మ సంఘ అధ్యక్షులు,గోగుపల్లి కురుమ సంఘ అధ్యక్షులు ఏనుగుల ఐలయ్య, ఏనుగుల మహేష్, కామల్ల కుమార్, బెల్లం రాజు, కురుమ సంఘ సభ్యులు పాల్గొన్నారు.