ప్రజా పాలనలో యూత్ కాంగ్రెస్ సహాయక చర్యలు
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన తరుణంలో ప్రవేశపెట్టిన ప్రజా పాలన కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజలకు సహా యక చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని రైతు వేదిక వద్ద నిర్వహిం చిన ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాసుదారులకు దరఖాస్తులు పూరించడంలో యూత్ కాంగ్రెస్ నాయకులు సహాయక చర్యలు చేపట్టారు. మంథని శాసనసభ్యులు, రాష్ట్ర ఐటీ శాఖ మాత్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు, శ్రీపాద చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ దుద్దిల్ల శ్రీను బాబు ఆదేశాల మేరకు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు దరఖాస్తుల పూరింపులో సహాయక చర్యలు చేపట్టి, ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటున్నారు. కాటారం మండల కేంద్రంలో జరిగి న ప్రజా పాలన కార్యక్రమంలో ఉపసర్పంచ్ నాయిని శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు చీమల సందీప్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొట్టే శ్రీహరి, సోషల్ మీడియా ప్రతినిధులు పసుల మొగిలి, చిలువేరు రూపేష్ తదితరులు హెల్ప్ కౌంటర్ లో పాల్గొని దరఖాస్తు దారులకు, ప్రజలకు గ్యారెంటీ పథకాల గురించి వివరిం చారు. ప్రజలకు కలిగిన సందేహాలను నివృత్తి చేశారు. ప్రజలు ఏ ఏ పథకాలకు అర్హులు అవుతారో అందుకు సంబంధించిన వివరాలను దరఖాస్తులో నమోదు చేయడం పట్ల ప్రజలు, మహిళలు యూత్ కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు.
1 thought on “ప్రజా పాలనలో యూత్ కాంగ్రెస్ సహాయక చర్యలు”