సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరిద్దాం
– ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం.
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : తొలి మహిళా ఉపాధ్యా యురాలు మాతా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పలువురు వక్తలు పాల్గొని ప్రసంగిస్తూ పూలే జీవిత ఆశయాలను ఆచరించాలని కోరారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని పలు ప్రభుత్వ శాఖ లలో పనిచేస్తున్న మహిళలలో ఉత్తమ సేవలు కనబరిచినందుకు ఏడుగురిని ఎంపిక చేసినట్లు జిల్లా అధ్యక్షులు గంట రాజబాబు తెలిపారు. పెద్దపెల్లి జిల్లా కేంద్రంలోని అమర్ చంద్ కళ్యాణ మండ పంలో ఎంపికైన ఉత్తమ మహిళా ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. ఎంపికైన వారికి ప్రశంసా పత్రం, మెమొంటో, గోల్డ్ మెడల్, శాలువాతో పాటు మాత సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పుస్తకాన్ని బహుకరించారు. ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వ ర్యంలో జరిగిన కార్యక్రమంలో కాటారం జిల్లా పరిషత్ హై స్కూల్ పీజీ హెచ్ఏం ఉమారాణి, ధన్వాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సోషల్ స్కూల్ అసిస్టెంట్ ఎండి పర్వీన్, మండల పరిషత్ పాఠశాల బూడిదిపల్లి ఎస్జిటి ఐ కవిత, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాటా రం గణితం స్కూల్ అసిస్టెంట్ బానోత్ కవిత, విలాసాగర్ యూపీఎ స్ పాఠశాల ఎస్జిటి ఏ లత, ధన్వాడ అంగన్వాడి టీచర్ కారెంగుల శ్రీలత, మర్రిపెల్లి మండల పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయురా లు పీ కల్యాణి, భూపాలపల్లి జిల్లా ఆల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ జిల్లా అధ్యక్షులు గంట రాజబాబు లను ఘనంగా సన్మానించి అవా ర్డులు అందజేశారు.సంఘం జాతీయ అధ్యక్షురాలు వేముల జ్యోతి, రాష్ట్ర అధ్యక్షులు లింగమల్ల శంకర్, జిల్లా అధ్యక్షులు గంట రాజ బాబు లు పాల్గొన్నారు.
1 thought on “సావిత్రిబాయి పూలే ఆశయాలను ఆచరిద్దాం ”