ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని గ్రామ గ్రామాన జరుపుకోవాలి
ఏటూరునాగారం, తెలంగాణ జ్యోతి : ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ పిలుపు నిచ్చింది. గురువారం ఏటూరు నాగారం మండల కేంద్రంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి గొంధి రాజేష్ మాట్లాడుతూ ఆగస్టు 9 నాడు ప్రపంచ ఆదివాసుల హక్కుల దినోత్సవాన్ని జిల్లా వ్యాప్తంగా గ్రామ గ్రామాన పండగ వాతావరణంలో జరుపు కోవాలని పిలుపునిచ్చారు. ఏజెన్సీ ప్రాంతంలోని ఆదివా సులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని, వర్షాకాలం లో ప్రభలించే విష జ్వరాలు నివారించేందుకు, ములుగు ఏజెన్సీ జిల్లాలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలని డిమాండ్ చేశారు.జిల్లాలో ప్రభుత్వ భూము లలో గుడిసెలు వేసుకున్న ఆదివాసులకు కనీస వసతులు కల్పించాలని, వారు నివాసం ఉంటున్న ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు దుగ్గి చిరంజీవి, జజ్జరి దామోదర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు వంకారాములు, కురుసం ప్రవీణ్, కోటే కృష్ణారావు, తోలం కృష్ణారావు, కుర్సం శాంత కుమారి పాల్గొన్నారు.