బావిలో మహిళ మృతదేహం లభ్యం

On: December 6, 2025 9:33 PM

బావిలో మహిళ మృతదేహం లభ్యం

– ఎనిమిది రోజులుగా కనిపించని గున్నాల పద్మగా గుర్తింపు

– విచారణ చేస్తున్న పోలీసులు

ములుగు, డిసెంబర్ 6, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి శివారులోని ఓబావిలో మహిళ మృతదేహం లభించగా ఎనిమిది రోజులుగా కనిపించకుండా పోయిన మహిళగా గుర్తించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై వెంకటేశ్వర్ రావు తెలిపిన వివరాల ప్రకారం.. బండారుపల్లికి చెందిన గున్నాల పద్మ (40) తరచూ క్రైస్తవ మత ప్రచార కార్యక్రమాలకు వెళ్తూ ఉండేది. అయితే ఎనిమిది రోజుల క్రితం నుంచి ఇంటివద్ద కనిపించకపోవడంతో బంధువులు ఏదైనా కార్యక్రమానికి వెళ్లి ఉండొచ్చని భావించారు. అయితే శుక్రవారం సాయంత్రం సమయంలో గ్రామస్థుడైన సముద్రాల సాయిరాం తన వ్యవసాయ బావిలో మృతదేహం ఉందని తెలపగా పరిశీలించగా గున్నాల పద్మదిగా గుర్తించారు. విషయం తెలుసుకున్న ఆమె తమ్ముడు గున్నాల బిక్షపతి ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉడటంతో ఎస్సై వెంకటేశ్వర్ రావు శవ పంచనామా నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment