స్పీడ్ బ్రేకర్లకు తెలుపు పెయింట్
ఎర్రగుంటపల్లి యూత్ సామాజిక సేవ
కాటారం, జనవరి 13, తెలంగాణ జ్యోతి : గ్రామపంచాయతీ లోని జాతీయ రహదారి లో భూపాలపల్లి – కాలేశ్వరం, మంథని వైపు వెళ్లే రోడ్డులో స్పీడ్ బ్రేకర్స్ వేసి వాటికి ఎలాంటి ప్రమాద హెచ్చరికలు లేవు. మేడారం జాతర సమీపిస్తున్నందున ప్రమాదాలు జరగకుండా ఎర్రగుంట పల్లె యూత్ ఆధ్వర్యంలో స్పీడ్ బ్రేకర్లకు తెల్ల రంగు వేసి స్పీడ్ బ్రేకర్ వాహనదారులకు తెలిసేలా ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో ఎర్రగుంటపల్లి యూత్ అధ్యక్షుడు ఇప్పలపల్లి దేవేందర్, ఎర్రగుంటపల్లి యూత్ అధ్యక్షుడు ఇప్పలపల్లి దేవేందర్ ,BRS యూత్ మండల అధ్యక్షుడు రామిళ్ళ కిరణ్, వార్డ్ మెంబర్లు మానెం రాజబాబు, కొండపర్తి జ్యోతి రవి, మైనార్టీ సెల్ మండల యూత్ అధ్యక్షుడు ఎండి మూబిన్, మాచర్ల రాజనారాయణ, శ్రీరాముల రజనీకాంత్,రహీం, సమర్పన్ తదితరులు పాల్గొన్నారు.






