Latest News
మా రెండేళ్ల పాలనకు ఈ ఫలితాలే నిదర్శనం : సీఎం రేవంత్ రెడ్డి... సేవతీర్థ్ ను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ... కేసీఆర్‌ను కూడా ప్రజలు ఓడించారు: రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్... సృష్టి సంతానోత్పత్తి కుంభకోణంలో డాక్టర్ నమ్రతను అరెస్ట్ చేసిన ఈడీ... గొర్రెలు కాదు..! గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులు ట్రక్కుల్లో తరలింపు : హెడ్ మాస్టర్ సస్పెండ్... మున్సిపల్ ఫలితాల ఊపుతో... మార్చిలో పరిషత్‌ వార్‌!... ములుగు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయ దుందుభి...    

ములుగు మున్సిపాలిటీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

On: February 12, 2026 4:15 PM

ములుగు మున్సిపాలిటీ బరిలో 83మంది

ములుగు మున్సిపాలిటీలో కౌంటింగ్‌కు సర్వం సిద్ధం

ములుగు, తెలంగాణ జ్యోతి : ములుగు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మున్సిపాలిటీ లో మొత్తం 20 వార్డులకు సంబంధించిన పోలింగ్ ఫిబ్రవరి 11న ప్రశాంతంగా ముగియగా, 80.41 శాతం పోలింగ్ నమోదైంది. లెక్కింపు ప్రక్రియ ఫిబ్రవరి 13న ఉదయం 7 గంటలకు ప్రారంభమై, ఉదయం 8 గంటల నుండి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రారంభం కానుంది. మొత్తం 3 రౌండ్లలో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నారు. ఇందుకోసం 7 టేబుళ్లు, 7 రిటర్నింగ్ అధికారులు (ROs),7 అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు (AROs), 9 కౌంటింగ్ సూపర్వైజర్లు, 18 కౌంటింగ్ అసిస్టెంట్లు నియమించినట్లు మున్సిపల్ కమిషనర్ రమేష్ తెలిపారు. ఎన్నికల లెక్కింపు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!