మెడికల్ కాలేజీ ఉద్యోగాల భర్తీలో ఏం జరుగుతోంది..?
– అభ్యంతరాలు తెలిపిన 10 మందిని కమిటీ ముందు హాజరు కావాలని సూచన
– ఫైనల్ లిస్ట్ లో ఆ 10మంది సర్టిఫికెట్లు వెరిఫై చేయని ఆఫీసర్లు
– త్రీమెన్ కమిటీ ఆదేశాలలో గందరగోళం
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : మెడికల్ కాలేజీ ఉద్యోగాల భర్తీలో అవకతవకలు జరిగినాయనే ఆరోపణలకు త్రీమెన్ కమిటీ ఆదేశాలు, మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ప్రకటన బలాన్ని చేకూరుస్తున్నాయి. ఇటీవల మెడికల్ కాలేజీలో వివి ధ విభాగాల్లోని 32 ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చి ఫైనల్ లిస్ట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే రిక్రూట్మెంట్ లో అవకతవకలు జరిగాయని ఆరోపణ లు రావడంతో త్రీమెన్ కమిటీ సభ్యులు అభ్యంతరాలను స్వీకరించారు. జూలై 30 నుంచి ఆగస్టు 3వతేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించగా 10 అభ్యర్థనలు వచ్చినట్లు మెడి కల్ కాలేజీ ప్రిన్సిల్ మోహన్లాల్ గురువారం ప్రకటించారు. అయితే ఫైనల్ లిస్ట్ లో ఎవరిపై అయితే ఆరోపణలు, అభ్యం తరాలు వచ్చాయో వారిని విచారించి సర్టఫికెట్లు వెరిఫై చేయాల్సిన ఆఫీసర్లు అభ్యతరాలు తెలిపిన వారినే ఈనెల 10 వ తేదీన త్రీమెన్ కమిటీ ముందు హాజరు కావాలని సూచించారు. శనివారం 3గంటలకు కలెక్టర్ కార్యాలయంలో సెలక్షన్ కమిటీని కలవాలని ప్రకటించారు. అయితే నిబంధ నలకు విరుద్ధంగా రిక్రూట్మెంట్ జరిగిందని అభ్యంతరాలు తెలిపితే, సెలక్షన్ కమిటీకి తప్పుడు ధృవీకరణ పత్రాలు, అర్హతలు లేకుండా రిక్రూట్ మెంట్ అయిన వారిని పిలిచి విచారించాల్సింది పోయి కంప్లెయింట్ రేస్ చేసిన వారిని ఎందుకు పిలుస్తున్నారని వివిధ రాజకీయ, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. అధికారులు ఎవరికి కొమ్ము కాస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు మెడికల్ కాలేజీ సీట్ల భర్తీలు పారదర్శకత పాటించాలని, ఎవరిపై అయితే ఆరోప ణలు వచ్చాయో వారిని పిలిపించి వెరిఫై చేయాలని డిమాం డ్ చేస్తున్నారు.