ప్రపంచ ఆదివాసి దినోత్సవానికి విస్తృత ఏర్పాట్లు
– ఆదివాసీ సంఘాల ఐక్యవేదిక.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ప్రపంచ ఆదివాసి దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించేందుకు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఆదివాసి సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లను ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఆదివాసీల ఆరాధ్య దైవం శ్రీ కొమరం భీం విగ్రహాల కు పూలమాలలు వేసి ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం భారీ ర్యాలీ నిర్వహిం చేందుకు సన్నాహాలు సిద్ధం చేశారు. భద్రాచలం నియోజక వర్గం 5వ షెడ్యూల్డ్ ఏరియా అయినా వెంకటా పురం, వాజేడు మండలాల లో ఆదివాసి దినోత్సవం సందర్భంగా గ్రామ గ్రామాన ఉత్సవాలు జరుపుకోవాలని ఆదివాసి సంఘా లు ఆదివాసి సోదరులకు, కుటుంబాలకు పిలుపునిచ్చారు.