పెద్దపల్లి ఎంపీ గా గడ్డం వంశీ నీ భారీ మెజార్టీ తో గెలిపిస్తాం.
– బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ.
మహాదేవపూర్, తెలంగాణ జ్యోతి: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ తో గెలిపించాడానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి , పెద్దపల్లి పార్లమెంట్ ఇంఛార్జి, శ్రీధర్ బాబు , మరియు శ్రీపాదరావు ట్రస్ట్ చైర్మన్ శ్రీను బాబు అండ దండలతో, స్థానిక ప్రజా ప్రతినిధులతో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్య కర్తలు, సహాయ సహకారాలతో వంశీ కృష్ణ గెలుపు కోసం కృషి చేస్తానని తెలిపారు. మాజీ స్పీకర్ స్వర్గీయ శ్రీ శ్రీపాద రావు ఆధ్వర్యంలో స్వర్గీయ కాకా వెంకటస్వామిని గెలిపించుకున్నామని, శ్రీపాదరావు హయంలో వెంకటస్వామి పార్లమెంట్ సభ్యునిగా, పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో అనేక అభివృధి కార్యక్రమాలు, ఎనలేని సేవ కార్యక్రమాలు చేశారని గుర్తు చేశారు. మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు , పెద్దపల్లి ఎంపీ గా గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజార్టీ తో గెలిపించి తీరుతామని తెలిపారు.