త్వరలో మెడిల్ కాలేజీ ప్రారంభిస్తాం…
– వసతుల కల్పన, తాత్కాళిక భవనం కోసం పరిశీలన
– వైద్యవిధాన పరిషత్ కమిషనర్; డీఎంఈలతో కలిసి
— ఎన్ఎంసీకి అప్లై చేశాం – ములుగు ఆస్పత్రి పరిశీలన
– మేడారం వనదేవతలకు ప్రత్యేక పూజలు
– డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్
ములుగు, ఫిబ్రవరి15, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజీ తరగతులను త్వరలో ప్రారంభిస్తామని, వసతులు, భవనం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డాక్టర్ రవీందర్ నాయక్ అన్నారు. గురువారం ములుగు జిల్లా పర్యటనలో భాగంగా డీహెచ్ రవీందర్ నాయక్ తోపాటు వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ కుమార్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అకాడమిక్) డాక్టర్ శివరామ కృష్ణలతో కలిసి తాడ్వాయి మండలంలోని మేడారం వనదేవతలను దర్శించుకున్న అనంతరం భక్తులకు కల్పించే వైద్యసేవలను పరిశీలించారు. అనంతరం ములుగుకు వచ్చిన వారు జిల్లా ఆస్పత్రిని పరిశీలించి వైద్య అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీహెచ్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ ములుగులో నిర్మాణమవుతున్న జిల్లా ఆస్పత్రిలో మెడికల్ కాలేజీ తరగతుల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని సూచించారు. ప్రస్తుతం 100 పడకల ఆస్పత్రి అందుబాటులో ఉందని, కొత్తగా నిర్మాణమవుతున్న 300ల పడకల ఆస్పత్రిలో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకంపై ప్రణాళికలు సిద్దమవుతున్నాయన్నారు. జిల్లాలో ప్రజలకు కావాల్సిన వైద్య సదు పాయాల కల్పనలో ఇంకా ఏమైనా అవసరం ఉంటే వెంటనే ప్రతి పాదనలు పంపాలని వైద్యవిదాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ కుమార్ సూచించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (అకడమిక్) డాక్టర్ శివరామకృష్ణ మాట్లాడుతూ ములుగుకు కేటాయించిన మెడికల్ కాలేజీ కోసం అలాట్ అయిన కేఎంసీ ప్రిన్సిపల్ను ములుగు మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ గా బాధ్యతలు అప్పగించామని, కొత్త మెడికల్ కాలేజీ భవనాన్ని నిర్మాణం పూర్తికాకపోవడంతో బాధ్యతలు స్వీకరించలేదని తెలిపారు. తాత్కాళిక తరగతులు ప్రారంభం కావాలంటే 220పడకల భవనాలు అవసరం ఉంటాయని, అందుబాటులో ఉంటే ప్రారంభిస్తామన్నారు. కొత్త మెడికల్ కాలేజీ భవనం పూర్తయ్యేవరకు ఇబ్బందులు తలెత్తుతాయ న్నారు. వైద్య విద్యార్థుల కోసం కావాల్సిన మౌళిక వసతులు, టీచింగ్ స్టాఫ్‌తో పాటు హాస్టల్ నిర్వహణ కోసం జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి భవనాలను సిద్దం చేయాలని కోరామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు కోసం తమ శాఖ ద్వారా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం ములుగుకు వచ్చి వసతులు ఉన్నాయా లేదా అద్దెభవనం కోసం పరిశీలన చేస్తున్నామన్నారు. ఇప్పటికే జాతీయ మెడికల్ కౌన్సిల్ కు అప్లై చేశామని, ప్రభుత్వానికి రెండు పర్యాయాలు నివేదిక అందించామన్నారు. అయితే ఇంకా అనుమతులు రాలేదన్నారు. మెడికల్ కాలేజీపై జాతీయ మెడికల్ కౌన్సిల్ ఇంకా ఇన్స్పెక్షన్ చేయాల్సి ఉందని పేర్కొన్నారు. ములుగు జిల్లా ఆస్పత్రిని మెడికల్ కాలేజీ కోసం డీఎంఈకి అప్పగించామన్నారు. మేడారంలో కావాల్సిన వసతులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు చిన్న ప్రమాదాల నుంచి హార్ట్ ఎటాక్ తదితర సేవలను అందుబాటులో ఉంచుతున్నామన్నరాఉ. ఇప్పటికే మేడారంలో 50పడకల ఆస్పత్రి భక్తులకు అందుబాటులో ఉంచామని వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎం హెచ్‌ఓ డాక్టర్ అల్లెం అప్పయ్య, ఆస్పత్రి సూపరిండెంట్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జగధీశ్వర్, డాక్టర్ పూజారి రఘు, ఇతర వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు.