బలరాంనాయక్ గెలుపులో మేము భాగస్వాములవుతాం

Written by telangana jyothi

Published on:

బలరాంనాయక్ గెలుపులో మేము భాగస్వాములవుతాం

– కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ములుగు జిల్లా కమిటీ.

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం :  మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభా గం ములుగు జిల్లా కమిటీ ముఖ్య సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి మహిళా విభాగం అధ్యక్షురాలు అప్పన నరేంద్ర అధ్యక్షత వహించగా జిల్లా అధ్యక్షుడు పూజారి మాణిక్యం మాట్లాడుతూ ములుగు జిల్లా అభివృద్ధి చెందాలంటే సీతక్కకు కుడి భుజంగా బలరాం నాయక్ ని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని బలరామ్ నాయక్ గెలిచినట్లేతే ములుగు జిల్లా కు ఎంపీ నిధులు ఎక్కువగా రావడానికి ఆస్కారం ఉంటుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి వికలాంగుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా వికలాంగుల సంక్షేమానికి చాలా ప్రాధాన్యత ఇచ్చిందని రేవంత్ రెడ్డి అధ్య క్షతన ఉన్న ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా వికలాంగుల సంక్షేమానికి సాధికారతకు కట్టుబడి ఉన్నదని ఆ దిశగా పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని అందులో భాగంగా వికలాంగుల జీవన భృతి అయిన పెన్షన్ 4వేల నుండి 6 వేలకు పెంచినదని, ఇందిరమ్మ ఇళ్ల లో కూడా వికలాంగులకు ఐదు శాతం కోటా ను అమలు చేస్తుందని, వికలాంగుల కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందించి వారి జీవనోపానికి సహకరిస్తుందని, అర్హులైన దివ్యాంగ కుటుం బాలకు 35 కిలోల అంత్యదయ రేషన్ కార్డులను మంజూరు చేస్తుందని, అర్హులైన దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేస్తుందని ఆ దిశగా కార్యాచరణ జరుగుతుందని ఎంపి ఎన్నికల అనంతరం పూర్తిస్థాయిలో వికలాంగుల కార్పొరేషన్ అమల్లోకి వస్తుందని కార్పొరేషన్ చైర్మన్ ముత్తి నేని వీరయ్య వర్మ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వికలాంగుల జీవితాల్లో వెలుగులు నిండుతాయని అన్నారు. మహిళా విభాగం అధ్య క్షురాలు అప్పన నరేంద్ర మాట్లాడుతూ మంత్రి సీతక్క మహిళ దివ్యాంగుల పట్ల ప్రత్యేక చొరవ చూపుతారని వారి స్వయం ఉపాధి శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆర్థిక స్వాలంబనను ప్రోత్సహిస్తారని అన్నారు. ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం అధికార కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన పోరిక బలరాం నాయక్ కి మద్దతుగా ఉంటుందని వారి గెలుపులో మనం కూడా భాగస్వాములం కావలసిన అవసరం ఉన్నదని మే 13న ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించు కోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ములుగు జిల్లా ఉపాధ్యక్షురాలు పొన్నం కల్పన, ప్రధాన కార్యదర్శి సారిక శ్రీలత, సోషల్ మీడియా కోఆర్డినేటర్ పొన్నం సంతోష్ గౌడ్, కమిటీ సభ్యులు గీత,భాస్కర్, రాజు, మరియు యూత్ కాంగ్రెస్ ఏటూరునాగారం మండల అధ్యక్షులు గద్దల నవీన్, టౌన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సరి కొప్పుల శ్రీను, టౌన్ యూత్ అధ్యక్షులు బండారి లక్కి, మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు.

Tj news

1 thought on “బలరాంనాయక్ గెలుపులో మేము భాగస్వాములవుతాం”

Leave a comment

Telegram Group Join Now
WhatsApp Group Join Now