క్రికెట్ క్రీడల్లో ములుగు జిల్లాకు పేరు తేవాలి
యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్య
ములుగు, జనవరి5, తెలంగాణ జ్యోతి : క్రికెట్ క్రీడల్లో ఉత్తమంగా ప్రతిభ కనబర్చి రాణిస్తూ ములుగు జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ సూర్య పిలుపునిచ్చారు. సోమవారం ములుగు మండలం జగ్గన్నపేటలో గ్రామ క్రికెట్ టీం సభ్యులకు టీషర్ట్స్ అందజేశారు. సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని కొత్తూరు లో నిర్వహించనున్న టోర్నీలో విజేతలుగా నిలువాలని సూర్య సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులకు కొదువలేదని, మంచి కోచింగ్ తీసుకుంటూ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మారం సుమన్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ బండి మధు, నాంపల్లి సుమన్, తదితరులు పాల్గొన్నారు.






