సీఎం రేవంత్ రెడ్డి ని కలిసిన వాజేడు కాంగ్రెస్ నాయకులు
– మండలంలో సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం
– సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని ధర్మవరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కాలేశ్వరపు సర్వేశ్వరరావు పటేల్, రాజబాబు, గగ్గూరి అశోక్, నరెడ్ల నాగరాజు, లక్ష్మీపురం గ్రామానికి చెందిన బంధం కృష్ణ తదితరులు మంగళవారం హైదరాబాదులో ని, సీ.ఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ములుగు జిల్లా మారుమూల గిరిజన వాజేడు మండలంలోని, వివిధ సమస్యలపై సీ.ఎం కి వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా చెరుకూరు టు ధర్మవరం రోడ్డు విస్తరణ పనులు నిలిపివేయడం వలన వాహనదారులు ఇబ్బందులకు గురై ప్రమాదాలు జరుగుతున్నా యని తెలిపారు. అదేవిధంగా చెరుకూరు నుండి చింతూరు, లక్ష్మీపురం మీదుగా ధర్మవరం వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించాలని కోరారు. రోడ్ పనులు ముందుకు వెళ్లడం లేదని, ప్రతి ఎడాది జూలై ,ఆగస్టు నెలలలో గోదావరి వరదలకు, ముంపు ప్రాంతాల గ్రామాలలో కరెంటు సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. వాజేడు మండలంలోని మోడికుంట వాగు ప్రాజెక్టును పూర్తిచేసి, వేలాది ఎకరాల పంట పొలాలను సస్యశ్యామలం చేయాలని వినతిపత్రం లో కోరారు. ఇంకా వివిధ సమస్యల పైన ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డికి వినతి పత్రం అందించారు. ఈ సమస్యలపై ముఖ్యమంత్రి సానుకూలంగా , స్పందించి సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అధికారులకు ఆదేశాలు జారి చేస్తానని తెలపడం జరిగింది. మారుమూల మండల గిరిజన గ్రామాల సమస్యలను సీ.ఎం. దృష్టికి తీసుకెళ్లిన కాంగ్రెస్ నాయకుల ను మండల ప్రజలు , గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ సి.ఎం.ను కలిసీన. కాంగ్రెస్ నాయకులకు మండల ప్రజలు అభినందనలు తెలిపారు. మారుమూల గిరిజన ప్రాంతం నుండి ప్రజా సమస్యల పరిష్కారం కోసం హైదరాబాద్ వచ్చిన వాజేడు కాంగ్రెస్ నాయకులను,కార్యకర్తలు ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారిని అభినందించారు. ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి, పరిష్కరించే దిశగా కార్యకర్తలు కృషి చేయాలని, ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అర్హులైన పేదలకు అందించే విధంగా పని చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి నాయకులనుకార్యకర్తలు కు అభినందనలు తెలుపుతూ కోరారు.