నల్లబెల్లం,పటిక సీజ్ చేసిన ఎక్సైజ్ అధికారులు
తెలంగాణ జ్యోతి, ఖానాపూర్ : మండలం లోని ధర్మారావు పేట లో కొందరు వ్యక్తులు అక్రమంగా నల్లబెల్లం, పటిక ను నిల్వ ఉంచి చుట్టు పక్కల గ్రామాల్లో నాటుసారా తయారీ దారులకు విక్రయిస్తున్నారనే పక్క సమాచారం మేరకు నర్సంపేట ఎక్సైజ్ సిబ్బంది దాడులు నిర్వహించారు. ఇంట్లో రహస్యంగా దాచిన 26 నల్ల బెల్లం బస్తాలు, 100 కేజీల పటిక ను స్వాధీనం చేసుకొని గూడూరు మండలం లైన్ తండా కు చెందిన భూక్యా నామ మరియు భూక్యా రమేష్ పై కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ నరేష్ రెడ్డి తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సైలు, రాజన్న, శార్వాణి మరియు సిబ్బంది లింగేశ్వర , వాజిద్, సురేందర్, రామ్మూర్తి, స్వర్ణలత, లోకేష్, నాగరాజు, వినోద్ పాల్గొన్నారు.