మృత కుటుంబాన్ని పరామర్శ
వెంకటాపూర్, తెలంగాణ జ్యోతి : మండలంలోని జవహర్నగర్ గ్రామానికి చెందిన కోపల జనార్ధన్ గత కొన్ని కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు తుది శ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న ములుగు జిల్లా ఏరియా ఆసుపత్రి వైద్య బృందం మృత కుటుంబాన్ని పరామర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. కాగా, జనార్ధన్ ములుగు ఏరియా హాస్పిటల్ లో ఔట్సోర్సింగ్ పద్ధతిలో వార్డ్ బాయ్ గా విధులు నిర్వర్తించేవాడు. మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ తరపున వారి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని, జనార్ధనకు రావలసిన ప్రభుత్వ బెనిఫిట్స్ అందజేయాలని, వారికి కట్ అయిన పిఎఫ్ లో కాంట్రిబ్యూషన్ అమౌంట్ లో వారి భార్యకు నెల నెల పింఛన్ అందజేయాలని ములుగు జిల్లా కలెక్టర్, ఏరియా హాస్పిటల్ డి సి హెచ్ ఎస్ అండ్ సూపరిండెంట్ లను మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ తరపున డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో ఆఫీస్ సీనియర్ అసిస్టెంట్ ఉదయ్ రెడ్డి, సతీష్, రమేష్, వినోద్, ఫజల్, వేణు, శ్రీను, కుమార్ లు ఉన్నారు.
1 thought on “మృత కుటుంబాన్ని పరామర్శ”