ఏజెన్సీ ప్రాంత ఇసుక ర్యాంపులలో బినామీ మాఫియా దోపిడీ
– ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా వెంకటాపురంమండలం బోదాపురం లో శనివారం ఏ.ఎస్పీ ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ ములుగు జిల్లా కన్వీనర్ పర్శిక సతీష్ మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో ఇసుక రైజింగ్ కాంట్రాక్టర్లు ఇసుక మాఫియా ప్రబుత్వ నియమ నిబంధన లను అతిక్రమించి, రాత్రి సమయంలో జెసిబి, టిప్పర్ల సహాయంతో గోదావరి నది నుండి ఇసుకను డంపింగ్ యార్డుకు తరలిస్తున్నార న్నారు. ఇసుక సొసైటీ సభ్యులకు తులం,ఫలం ముట్టజెప్పి అక్ర మంగా ఇసుక ర్యాంపులను కైవసం చేసుకున్న గత్తెందారులు , ఒక లారీకి రెండు బకెట్లు చొప్పున అధికంగా ఇసుక వేస్తున్నారన్నారు. ఒక బకెట్ కి రెండు వేల రూపాయలు చొప్పున అధికంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఆదివాసీల దశాబ్దాల పోరాటాల ఫలితంగా రూపొందించబడ్డ 1996 స్వయం పాలన గ్రామసభ చట్టం, స్వర్గీయ డాక్టర్ బి.డి శర్మ ఐఏఎస్ ఆలోచనతో రూపొందించ బడినది అన్నారు. షెడ్యూల్ ప్రాంతాలలో గ్రామ సభలకు వనరు లపై అధికారం ఉంటుందన్నారు. ఏజెన్సీలో విలువైన వందల కోట్ల రూపాయల ఇసుక మాఫియా విధానాన్ని నిర్మూలించాలని డిమాం డ్ చేశారు. .రాజకీయ దళారులు డా”బీ.డీ శర్మ ఆశయాలకు నీళ్లు చల్లారు. గ్రామాలలో తెల్లచొక్కాలు వేసుకునే కొందరు రాజకీయ దళారులు బినామీలుగా మారిపోయి, ఆదివాసి చట్టాలను ఇసుక లో పాతరేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇసుక ర్యాంపులలో నియమ నిబంధనలను పాటించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బినామి ఇసుక మాఫియా విధా నాన్ని నిర్మూలించడానికి ఐ.టి.డి.ఏ ఆధ్వర్యంలో, సొసైటీలకు నిధులు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ వెంకటాపురం మండల అధ్యక్షులు తుర్శ కృష్ణబాబు, ఉపా ధ్యక్షులు తాటి రాంబాబు, ప్రధాన కార్యదర్శి కంతి నేత్రానంద్ కుమార్, రాజేష్, రఘు తదితరులు పాల్గొన్నారు.
1 thought on “ఏజెన్సీ ప్రాంత ఇసుక ర్యాంపులలో బినామీ మాఫియా దోపిడీ”