ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు

ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవు

– కాటారం పోలీసుల హెచ్చరిక 

కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ట్రాఫిక్ రూల్స్ అతిక్ర మిస్తే చర్యలు తప్పవని కాటారం పోలీసులు హెచ్చరించారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా కాటారం పోలీస్ స్టేషన్ లో కాటారం డిఎస్పి గడ్డం రామ్మోహన్ రెడ్డి, కాటారం సిఐ ఈఊరి నాగార్జున రావు, కాటారం ఎస్సై మ్యాక అభినవ్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రమాదాలు జరగకుండా డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని వారు సూచించారు. పరిమితికి మించి వాహనాలలో ప్రయాణికులను చేరవేయవద్దని సూచిం చారు. డ్రైవర్లు తప్పనిసరిగా తమ వాహన డ్రైవింగ్ లైసెన్స్ లను, వాహన ధ్రువీకరణ పత్రాలను విధిగా వాహనాల వెంట అందుబాటులో ఉంచుకోవాలని పేర్కొన్నారు. పోలీసులకు వాహన తనిఖీలలో సహకరించాలని అన్నారు. వాహన చోదకు లు మద్యం సేవించి వాహనాలు నడపవద్దని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతాయని వివరించారు. కాటారం ప్రధాన కేంద్రంగా మహదేవపూర్ వైపున కు గల ఆటో డ్రైవర్లు, గంగారం, ధన్వాడ, జాదరావుపేట, గూడూరు అలాగే చింతకాని, కొత్తపెళ్లి తదితర రూట్లలో గల ఆటో డ్రైవర్లను పిలిపించి వారికి రోడ్డు భద్రత నియమ నిబంధనలను వివరించారు. రోడ్డు భద్రత నియమ నిబంధన లను అతిక్రమించిన యెడల చట్టరీత్యా చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. అనంతరం కాటారం పోలీస్ స్టేషన్ నుంచి ఆటో ర్యాలీని నిర్వహించారు. అంబేద్కర్ కూడలి వరకు నిర్వహించిన ర్యాలీలో పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్లు సంయమనంతో వ్యవహరించాలని, ప్రయాణికుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. అనుమానిత వ్యక్తులను వాహనాలలో ఎక్కించుకోవద్దని హెచ్చరించారు. అనుమానిత వ్యక్తులు గ్రామాల్లో సంచరించినట్లయితే 100 నెంబర్ కు డయల్ చేసి వివరాలు తెలియజేయాలని కోరారు. వివరాలను గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్ర మంలో ఆటో డ్రైవర్లతోపాటు శిక్షణ ఎస్ఐ హేమలత, సివిల్, సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment