గ్రామ గ్రామాన గాంధీ జయంతి వేడుకలు
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : మహాత్మ గాంధీ జయంతి వేడుకలు బుధవారం ములుగు జిల్లా వెంక టాపురం,వాజేడు మండలాలలో అన్ని ప్రభుత్వ కార్యాలయా లు, సంఘాలు రాజకీయ పార్టీలు, వేరు వేరుగా గాంధీ జయం తి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాతిపిత బాపూజీ సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఆయన చిత్రపటా నికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వెంక టాపురం రెవిన్యూ కార్యాలయంలో తాసిల్దార్ లక్ష్మీ రాజయ్య గాంధీజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళుల ర్పించారు. అలాగే వెంకటాపురం వేప చెట్టు సెంటర్లో ఆర్య వైశ్య సంఘం ఆధ్వర్యంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులు అర్ఫించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు వేల్ఫురి లక్ష్మీ నారాయణ , ఆర్యవైశ్య సంఘం నాయకులు, బిఆర్ఎస్ నాయకులు గంపా రాంబాబు, పలువురు ప్రముఖులు గాంధి జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.