రహదారిపై దుమ్ము, ధూళి భరించలేక రోడ్డెక్కిన ప్రజలు
– వెంకటాపురంలో ఇసుక లారీల నిలిపివేత.
వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : వెంకటాపు రం టు చర్ల రహదారిలో రోడ్డు మరమ్మత్తులు పనులు రెండు సంవత్సరాలు అయినా నేటికీ పూర్తికానందున ప్రజలు నరక యాతన అనుభవిస్తున్నారు. అంతేకాక వందలాది ఇసుక లారీలు రేఇంబవళ్ళు రాకపోకలు కారణంగా రోడ్డు ప్రమాదా లు జరగడంతో పాటు, దుమ్ము ధూళి లతో శ్వాసకోశ వ్యా ధులు తో పాటు, అనారోగ్యం పాలవుతున్నామని, రోడ్ ప్రమా దాలు జరుగు తున్నాయని , ప్రజ ప్రతినిధులు, రాజకీయ పార్టీలు, అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోవట్లేదని, ఆగ్ర హం వ్యక్తం చేసిన వెంకటాపురం పట్టణ ప్రజలు, బుధవారం మధ్యాహ్నం వేప చెట్టు సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు. దీంతో ఇరువైపులా కిలోమీటర్ల కొద్ది లారీలు నిలిచిపోయా యి. సుమారు గంటకు పైగా ప్రజలు రోడ్డుపై బైఠాయిం⁸చడం తో, ట్రాఫిక్ స్తంభించిపోయింది. రోడ్డు మరమ్మతులు విష యంపై ఆర్ అండ్ బి కాంట్రాక్టర్లు ను ప్రశ్నించగా ఇసుక లారీలు నిలిపి వేయండి, అప్పుడు రోడ్డు పోస్తామంటూ సమా ధానం చెబుతున్నారని ప్రజలు తెలిపారు. వేలాదిమంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెంకటాపురం టు భద్రాచలం రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రజల రహదారి కాదని, యమపురికి రహదారిగా మారిందని, ప్రజలు శాపనార్థాలు పెడుతూ పాలక ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. సమాచారం తెలుసు కున్న వెంటనే వెంకటాపురం పోలీసులు ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ఇసుక లారీలు, రోడ్డు మరమ్మతు పనుల విషయంపై ఉన్నతాధికారులతో, సంబం ధిత ఆర్అండ్బీ అధికారులతో, కాంట్రాక్ట ర్తో మాట్లాడి రోడ్డు ఇబ్బందులు తొలగిపోయే విధంగా తొలగిపోయే విధంగా కృషి చేస్తామని పోలీసులు హామీ ఇవ్వటంతో రాస్తారోకో విరమిం చారు.రోడ్డెక్కిన ప్రజల ఆందోళనలతో సుమారు రెండు కిలో మీటర్ల కు పైగా ఇసుక లారీలు, ఇతర వాహనాలు నిలిచిపోయాయి.