విద్యానికేతన్ కు స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు
– అందజేసిన ట్రస్మా రాష్ట్ర నాయకులు
కాటారం, డిసెంబర్ 13, తెలంగాణ జ్యోతి : మండల కేంద్రం లోని విద్యానికేతన్ హైస్కూల్ కు స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు కు ఎంపికైంది. ట్రస్మా ఆధ్వర్యంలో ఇటి టెక్ ఎక్స్, బ్రెయిన్ ఫీడ్ సంస్థ శనివారం హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమంలో కరస్పాండెంట్ బుర్ర వెంకటేష్ గౌడ్ అవార్డును అందుకున్నారు. ట్రస్మా రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు శేఖర్ రావు, రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి , రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్ రావులు అవార్డును అందజేశారు. గత 18 ఏళ్లుగా అందిస్తున్న విద్యా సేవలకు గాను స్కూల్ ఎక్సలెన్స్ అవార్డు అందజేశారు. అవార్డు అందుకోవడం పట్ల కరస్పాండెంట్ వెంకటేష్ గౌడ్, ప్రిన్సిపాల్ సుజారాణి, తల్లిదండ్రులు, హర్షం వ్యక్తం చేశారు.








