ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా వేణుగోపాలాచారి
ములుగు ప్రతినిధి, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా బార్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా చక్రవర్తుల వేణుగోపాలాచారి ఎన్నిక య్యారు. బుధవారం ఎన్నికల అధికారులు దామల్ల సుధాకర్, మంద విజయ్ కుమార్ సమక్షంలో జరిగిన ఎన్నికల్లో నూతన కమిటీని ప్రకటించారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా రంగోజు భిక్షపతి, ఉపాధ్యక్షునిగా మేకల మహేందర్, కోశాధి కారిగా బానోతు స్వామిదాస్, సంయుక్త కార్యదర్శిగా ఓరుగంటి రాజేందర్, క్రీడా సాంస్కృతిక కార్యదర్శిగా రాచర్ల రాజ్ కుమార్, ఈసీ సభ్యులుగా మేకల అశోక్, రంగోజు సూర్యం ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మెంబర్లు, న్యాయ వాదులు పాల్గొన్నారు.