వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి బదిలీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణా జ్యోతి ప్రతినిది : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిషత్ అభివృద్ధి అధికారి అడ్డూరి బాబు బదిలీ అయ్యారు. పార్లమెంటు ఎన్నికల దృష్ట్యా, ఎలక్షన్ కమిషన్ ఆదేశం పై ఒకే జిల్లాలో మూడు సంవత్సరాలు పైబడి పని చేసిన అధికారులను బదిలీ చేసే ప్రక్రియలో భాగంగా, వెంకటాపురం ఎంపీడీవో ఎ. బాబు బదిలీ అయ్యారు. 2019 సంవత్సరం ములుగు జిల్లా కన్నాయి గూడెం మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా విధులు నిర్వహించిన ఏ. బాబు 2022 మే నెలలో, వెంకటాపురం ఎంపీడీవోగా బదిలీ అయ్యారు. సుమారు 20 నెలల పాటు మండల అభివృద్ధి అధికారిగా విదులు నిర్వహించిన ఎంపీడీవో ఏ. బాబు వివాదరహితులుగా, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలులో కిందిస్థాయి సిబ్బందితో, వివిధ విభాగాల శాఖల అధికారులతో సమీక్షలు నిర్వహించి , జిల్లా అధికారుల నుండి ప్రశంసలు పొందారు. మండల అభివృద్ధి ధ్యేయంగా ప్రజా ప్రతినిధులు రాజకీయ పార్టీలు ఆదివాసీలు అందరితో సమన్వయం పరిస్థితి పథకాలు అమలులో వేగం పెంచారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్త ఎంపీడీవోల బదిలీల్లో భాగంగా వెంకటాపురం ఎంపీడీవో ను భూపాలపల్లి జిల్లాకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.