రోడ్లపై వాహనాలు నిలుపరాదు : ఎస్సై తాజుద్దీన్

Written by telangana jyothi

Published on:

రోడ్లపై వాహనాలు నిలుపరాదు : ఎస్సై తాజుద్దీన్

తెలంగాణ జ్యోతి, ఏటూరునాగారం : మండల కేంద్రంలో రోడ్లకు ఇరువైపులా వ్యాపార సముదాయాలు ముందు ద్విచక్ర వాహనాలు ఆటోలు ఇతర వాహనాలు నిలుప కూడదని ఏటూరునాగారం ఎస్ఐ తాజుద్దీన్ అన్నారు. బస్టాండు ప్రాంతంలో రోడ్డు ఇరువైపులా వ్యాపార సముదాయాల ముందు వాహనాలు నిలిపిన వాహన దారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇష్టం వచ్చినట్లు ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పువు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సివిల్ .సిఆర్పిఎఫ్ పోలీసులు పాల్గొన్నారు.

Leave a comment