రామప్ప ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్‌గా మూడు వీరేష్
వెంకటాపూర్, ఫిబ్రవరి 13 (తెలంగాణ జ్యోతి): రామప్ప ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్‌గా మూడు వీరేష్ ఎన్నిక కావడం స్థానికంగా ఆనందాన్ని రేకెత్తించింది. వెంకటాపూర్ మండలంలోని పాలంపేట గ్రామ సమీపంలో యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయ ట్రస్ట్ బోర్డు డైరెక్టర్‌గా మూడు వీరేష్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆలయాభివృద్ధి, పర్యాటక వసతుల విస్తరణ, భక్తులకు మెరుగైన సదుపాయాల కల్పనలో తన వంతు కృషి చేస్తానని, ట్రస్ట్ కార్యకలాపాలను పారదర్శకంగా నిర్వహిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి సీతక్కకు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మల్లాడి రామ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడకుల అశోక్, తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ వెంకటాపూర్ మండల అధ్యక్షులు చెన్నోజు సూర్యనారాయణ, మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్‌తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.






