శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు.
– ఉత్తర ద్వార దర్శనంలో భక్తులకు దర్శనం
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామి ఉత్తర ద్వార దర్శనం ద్వారా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ అను వంశిక ధర్మకర్తలతో పాటు, దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం సందర్భంగా విస్తృత మైన సౌకర్యాలను భక్తులకు కల్పించారు. ఈ కార్యక్రమం ఆలయ అర్చకులు కురవి వీరభద్ర స్వామి దేవస్థానం శుక్ల యజుర్వేద పండి తులు, కృష్ణ యజుర్వేద పండితులు బాలకృష్ణ శర్మ, శ్రీకాంతాచా ర్యుల ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య శాస్త్రో త్తంగా జరిగిన ఉత్తర ద్వార దర్శనంతో, భక్తులు స్వామివారిని కనులారా వీక్షించి భక్తిశ్రద్ధలతో పునీతులయ్యారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
1 thought on “శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు. ”