వేసవిలో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి

Written by telangana jyothi

Published on:

వేసవిలో వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి

– ఎస్ఈ మల్చూర్ నాయక్ 

– 33/11కేవీ సబ్ స్టేషన్ తనిఖీ

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ కు అనుగుణంగా వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలని భూపాలపల్లి జిల్లా సూపరింటెండెంట్ ఇంజినీర్ బి.మల్చర్ నాయక్ సూచించారు. గురువారం ములుగులోని 33/11కేవీ సబ్ స్టేషన్ ను డీఈ పి.నాగేశ్వర్ రావు తో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగ ఎస్ఈ మల్చూర్ నాయక్ మాట్లాడుతూ వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా కోసం సిస్టం స్ట్రెంతెనింగ్ చేపట్టామని, అందులో భాగంగా కాశిందేవిపేట సబ్స్టేషన్ పరిధిలో పనులు నిర్వహించామన్నారు. 33/11కేవీ సబ్ స్టేషన్ పరిధిలో కాశిందేవిపేట 11కేవీ, పత్తిపల్లి, నర్వాపూర్ ఫీడర్ల వ్యవసాయ వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. 834 పోల్స్ వేశామని, 938పాడైన పోల్ లను మార్చివేశామన్నారు. వంగిపోయిన 116పోల్స్ సరిచేయడంతో పాటు 726 మిడిల్ పోల్స్ వేశామ న్నారు. లోడ్ ఎక్కువగా ఉన్న ట్రాన్స్ ఫార్మర్లపై అంద నంగా ఎనిమిది 63కేవీఏలను అమర్చి వినియోగదారులకు ఓడర్ లోడ్ భారాన్నితీర్చినట్లు వివరించారు. అదేవిధంగా ములుగు సబ్ స్టేషన్ కు సంబంధించిన ములుగు పట్టణంలో కొత్తగా ఆరు ఆరు 63కేవీఏ, రెండు 100కేవీఏ ట్రాన్స్ ఫార్మర్లు అమ ర్చామన్నారు.లో ఓల్టేజీ సమస్యలను అధిగమించేందు కు కన్వర్షన్లు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అవసరమైన చోట్ల ఏబీ స్విచ్ లను అమర్చినట్లు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో విద్యుత్ సిబ్బంది అందుబాటులో ఉండి వినియోగ దారులకు నిరంతర సేవలు అందించాలని ఎస్ఈ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఏడీఈ ఎన్.వేణుగోపాల్, ఏఈ సీహెచ్.సాయిక్రిష్ణ, సబ్ ఇంజినీర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment