నీతిమాలిన పనులు దుద్దిళ్లకే అలవాటు

On: December 4, 2025 5:22 PM

నీతిమాలిన పనులు దుద్దిళ్లకే అలవాటు

నీతిమాలిన పనులు దుద్దిళ్లకే అలవాటు

– సపాయి కార్మికుడికున్న విలువ పోలీసులకు లేకుండా పోతాంది

– ప్రజల పక్షాన పోరాటం చేస్తే అక్రమ కేసులు పెడ్తరా

– కోర్టులు మందలించినా పోలీసుల్లో మార్పు రావట్లే

– దుద్దిళ్ల కుటుంబాన్ని అర్థం చేసుకుంటే బాగుపడుతరు

– కాటారం మండల ప్రజల బిక్షతోనే మంత్రి పదవని గ్రహించాలే

– ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేదు లేదు

– మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

కాటారం, డిసెంబర్ 4, తెలంగాణ జ్యోతి : ప్రజల పక్షాన పోరాటం చేసే వాళ్లపై అక్రమ కేసులు పెట్టించే నీతిమాలిన పనులు దుద్దిళ్ల శ్రీధర్‌కు అలవాటేనని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ అన్నారు. ఇటీవల అక్రమకేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన కాటారం మండలం గంగారం గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్‌ నాయకుడు చల్లా శేఖర్‌రెడ్డిని ఆయన పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా తో మాట్లాడుతూ గంగారం గ్రామంలో చల్లా శేఖర్‌రెడ్డి ప్రజల పక్షాన గ్రామపంచాయతీలో ప్రజల డబ్బుల వసూళ్ల అన్యాక్రాంతం అయ్యాయని పోరాటం చేస్తే కాంగ్రెస్‌ ప్రభుత్వం దుద్దిళ్ల శ్రీధర్‌ నేతృత్వంలో అక్రమ కేసు పెట్టారని అన్నారు. కేసులు నిజమైనవి అయితే కనీసం 15రోజులు జైల్లో ఉండాలే కానీ మూడు రోజుల్లోనే బెయిల్‌ రావడంతో అక్రమకేసులు అని అర్థం అవుతుందన్నారు. ఎన్నిసార్లు దుద్దిళ్ల నైజాన్ని చెప్పినా పోలీసుల్లో మార్పు రావడం లేదని, మంత్రి పదవి ఎప్పుడు వస్తే అప్పుడు ఖాకీ దుస్తుల విలువ తీసేసుకుంటాండ్లని ఆయన అన్నారు. అందుకే సపాయి కార్మికుడికి ఉన్న విలువ ఖాకీలకు లేదని ఇప్పటికే చెప్పామని అన్నారు. అయినా మార్పు రావడం లేదని బారత రాజ్యాంగాన్ని అనుసరించి పోలీసు ఉద్యోగాలు పొందిన వారికి లాఠీ, తుపాకి ప్రజలను రక్షించడానికే ఇచ్చారని, కానీ నీచమైన పనులు చేస్తున్న పోలీసులకు ప్రాయశ్చిత్యం తప్పదన్నారు. అన్నం పెట్టి మంత్రి పదవి రావడానికి కాటారం మండల ప్రజలకే కారణమని, కాటారం ప్రజలు పెట్టిన బిక్షతోమంత్రి అయి ఈ ప్రాంత ప్రజలనే హింసిస్తూ అరిగోస పెడుతున్నాడని ఆయన వాపోయారు. అధికారంలో ఉంటే ఒక రకంగా అధికారంలో లేకపోతే ఒకరకంగా ఊసరవెల్లిలా ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌ వ్యవహరిస్తారని అన్నారు. ఆనాడు మందుబస్తాల కోసం ధర్నా చేసి ప్రజల పక్షాన నిలబడితే తనపై రౌడీషీట్‌ పెట్టారని ఆయన గుర్తు చేశారు, అలాగే జోడు శ్రీను, శేఖర్‌రెడ్డి, పూదరి సత్యనారాయణగౌడ్‌లపై అక్రమ కేసులు పెట్టారని, కోర్టుకు పోతే ఏ కేసులో పస లేదని వెంటనే బెయిల్‌ మంజూరీ చేశారన్నారు.అంతేకాకుండా భూపాలపల్లి న్యాయమూర్తి ఇది ఫేక్‌ కేసు అని అర్డర్‌ ఇచ్చారని, ఉన్నత చదువులు చదివి ఎల్‌ఎల్‌బీ చేసిన దుద్దిళ్ల శ్రీధర్‌ తల ఎక్కడ పెట్టుకుంటాడని ప్రశ్నించారు. దేవెందర్‌ రెడ్డి ప్రజల సోమ్ము వాడు కుంటాండ్లని పోరాటం చేస్తే కేసు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పదేండ్లు జెండా మోసిన దేవేందర్‌రెడ్డి ఆలోచన చేయాలని … గుండ్రాత్‌పల్లిలో ప్రభాకర్‌రెడ్డి, గంగారంలో దేవెందర్‌రెడ్డిలు అనేక దందాలు చేసి ఆ కుటుంబానికి సేవ చేశారని, ఈనాడు కూడా ఇంకా కాంగ్రెస్‌ జెండాలు, దుద్దిళ్ల ఫోటోలు పెట్టుకోవడంపై ఆలోచన చేయాలన్నారు. మిమ్మల్ని వాడుకుని కరివేపాకులా తీసేస్తారని, ఇక్కడ మీకు పతార లేకపోవడంతోనే మీ ఇంటి ఆడవాళ్లతో పోలీస్‌స్టేషన్‌కు పోయి కేసు పెట్టే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని గమనించాలన్నారు. ఇప్పటికి దుద్దిళ్ల కుటుంబం ఎక్కడా కన్పించరు కానీ మీ ఆడవాళ్లు మాత్రం రోడ్డెక్కి పోలీస్‌ స్టేషన్‌ల చుట్టూ తిరుగాలా అనేది ఆలోచించాలన్నారు. దుద్దిల్ల కుటుంబం గురించి అర్థం చేసుకున్న కనుకనే ఈనాడు తాను ఎమ్మెల్యే అయ్యానని, ఈ సమాజం అర్థం చేసుకోవాలనే తపన పడుతున్నానని అన్నారు. ఊసరవెల్లి కంటే ఎక్కువ దుద్దిళ్ల శ్రీధర్‌ అనేది ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటేనే బాగుపడుతారని ఆయన హితవు పలికారు. అధికారంలో లేనప్పుడు ఓ ఐపీఎస్‌ అధికారిని అవమానపర్చిన దుర్మార్గుడు దుద్దిళ్ల శ్రీధర్‌ అని ఆయన వివరించారు. ఓటు వేసే యంత్రాలుగానే ప్రజలను చూస్తారని, ప్రేమ అభిమానం ఉండదన్నారు. అధికారంలోకి వచ్చి నేటికి 24 నెలలు గడిచిపోయిందని ఇప్పటి వరకు 24మందికి ఉద్యోగాలో ఉపాధి అవకాశాలో కల్పించాడా లేక ఓ పరిశ్రమనైనా తీసుకువచ్చాడని ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. దుద్దిల్ల శ్రీధర్ చెప్పితే అక్రమ కేసులు పెట్టే పోలీసుల్లో మార్పు రావాలని, మారని ప్రతి పోలీస్‌ పేరును పింక్‌ బుక్‌లో రాసుకుంటున్నామని అన్నారు. రాజ్యాంగం అనుసరించి ఉద్యోగాలు వచ్చాయని పోలీసులు గమనించాలని శేఖర్‌రెడ్డిని మూడు రోజులు జైల్లో పెడితే ఎం వచ్చిందని ప్రశ్నించారు. అక్రమకేసులు పెడితే భయపడేది లేదని, ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గమని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట ఈ కార్యక్రమంలో జోడు శ్రీనివాస్, రామిల్ల కిరణ్, కూడుదుల రాజబాబు, కొండగొర్ల వెంకటస్వామి, అయిలి రాజ బాబు, తొంబర్ల రమణ, ఉప్పు సంతోష్, వంగల రాజేంద్రచారి, చిట్యాల సమ్మయ్య,,ఇప్ప నాగరాజు గాజుల విక్రమ్ కుమార్, తుటి మనోహర్,, బోడ తిరుపతి,బొల్లం రమేష్, జక్కుల సతీష్,బోగారి రమేష్, చల్ల తిరుపతి రెడ్డి, లింగరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!