సాయిబాబా ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

On: March 19, 2026 8:16 PM

సాయిబాబా ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

సాయిబాబా ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

ఏటూరునాగారం, మార్చి 19 తెలంగాణ జ్యోతి: మండల కేంద్రంలోని శ్రీ షిర్డీ సాయిబాబా దేవాలయంలో ఉగాది పర్వదినం సందర్భంగా శ్రీ ఫరాభవ నామ సంవత్సరం పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని అర్చకులు ఏళ్ల ప్రగడ సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాశుల ఫలితాలు, దేశ పరిస్థితులపై వివరాలు వెల్లడించారు. పాడి పంటలు సమృద్ధిగా పండుతాయని, వర్షాలు అధికంగా ఉంటాయని, వాణిజ్య పరిశ్రమలు పెరుగుతాయని తెలిపారు. అలాగే యుద్ధాలు, వాహన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉందని, షేర్ మార్కెట్‌లో మార్పులు సంభవిస్తాయని, కొన్ని వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భూకంపాలు, ఆస్తి నష్టం సంభవించే అవకాశాలు ఉన్నాయని, గ్రహణాలు లేవని వివరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు దాస్, చైర్మన్ పెండ్యాల ప్రభాకర్, ఉపాధ్యక్షుడు బచ్చు సతీష్, కోశాధికారి వెంకట్రావు, సహాయ కార్యదర్శి గంజి రమేష్, కమిటీ సభ్యులు, ఎంపీడీవో శ్రీనివాస్, మహిళ భక్తులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!