ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు…

On: January 22, 2026 7:08 PM

ఎదురెదురుగా ద్విచక్ర వాహనాలు ఢీ.. ముగ్గురికి గాయాలు…

వెంకటాపురం, జనవరి 22 (తెలంగాణ జ్యోతి): వెంకటాపురం మండల కేంద్ర శివారులోని మరికాల రోడ్ విద్యుత్ సబ్‌స్టేషన్ సమీపంలో గురువారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు మోటార్ సైకిళ్లు ఢీకొన్న ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగాగాయపడ్డారు.   108 అంబులెన్స్‌ లో గాయపడిన వారిని వెంకటాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఎటూరునాగారం, ములుగుకు తరలించనున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!