గిరిజన యువకుడు దారుణ హత్య

గిరిజన యువకుడు దారుణ హత్య

 – గొడ్డలితో నరికి చంపిన దుండగులు 

వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కొత్త టేకులగూడెం గ్రామానికి చెందిన గిరిజన యువకుడు వాసం విజయ్ 28 సంవత్సరాలు గుర్తు తెలియని దుండగులు తలపై గొడ్డలితో మోది అతి దారుణంగా హత్య చేసిన సంఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న వెంకటాపురం సిఐ బండార్ కుమార్ పేరూరు ఎస్సై గుర్రం కృష్ణ ప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తదనంతరం కుటుంబ సభ్యుల నుండి వివరాలు సేకరించి విచారణ ప్రారంభించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో టేకులగూడెం గ్రామంలో అలజడి మొదలైంది ఈ హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హత్య పైన పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

[metaslider id="19893"]

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment