దక్షిణ భారత సైన్స్ ఫెయిర్‌కు గిరిజన విద్యార్థి ఎంపిక
ములుగు, జనవరి12, తెలంగాణ జ్యోతి : జనవరి 7, 8, 9 తేదీలలో కామారెడ్డి జిల్లాలో విద్యా నికేతన్ విద్యాసంస్థ నిర్వహించిన రాష్ట్రస్థాయి సైన్స్ ఫెయిర్‌లో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల, రాయినిగూడెం (ములుగు జిల్లా) విద్యార్థి పి. తరుణ్ (9వ తరగతి) అత్యున్నత ప్రతిభ కనబరిచి దక్షిణ భారత సైన్స్ ఫెయిర్ పోటీలకు ఎంపికయ్యారు. హెల్త్ అండ్ హైజిన్ అంశంలో ‘ట్రెడిషనల్ హెర్బల్ మెడిసిన్’ ప్రాజెక్ట్‌ను ప్రదర్శించిన తరుణ్ తన ప్రతిభతో న్యాయనిర్ణేతలను ఆకట్టుకొని, మొట్టమొదటిసారిగా ఏటూరు నాగారం ఐటీడీఏ పరిధిలోని ములుగు జిల్లా నుంచి దక్షిణ భారత రాష్ట్రాల పోటీలకు ఎంపిక కావడం విశేషంగా నిలిచింది. ఆయన 18 జనవరి 2026 నుండి జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టుకు బయాలజీ ఉపాధ్యా యుడు, గైడ్ టీచర్ ప్రతాప్ సింగ్ విద్యార్థికి మార్గనిర్దేశం చేస్తూ పూర్తి సహకారం అందించారు. ఈ సందర్భంగా విద్యార్థిని మరియు గైడ్ టీచర్‌ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం అభినందించారు.






