భారీ వర్షంతో విద్యుత్తు లైన్ల పై విరిగిపడిన చెట్లు
– అంధకారంలో వెంకటాపురం మండలం
వెంకటాపురం, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా వెంకటా పురం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం గాలి దుమారం తో భారీ వర్షం కురిసింది. దీంతో మండల పరిధిలోని చిరుత పల్లి గ్రామంలో విద్యుత్తు లైన్లపై చెట్లు విరిగి పడటంతో వెంక టాపురం సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫారం, బ్రేకర్స్ దెబ్బతిన్నాయి. దీంతో మండలంలోని ఎనిమిది పంచాయతీల పరిదిలో 24 గ్రామాల్లో మధ్యాహ్నం మూడు గంటల నుండి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మండలకేంద్రం అర్బన్ క్యారెక్టర్ కలిగిన వెంకటాపురం పట్టణంలో సైతం అంధకారంలో మగ్గు తున్నది. అంతేకాక వెంకటాపురం లోని 132 కెవి విద్యుత్ సబ్స్టేషన్లో కూడా బ్రేకర్స్ డౌన్ అయ్యాయి. దీంతో సుమారు 20 మందికి పైగా విద్యుత్ సిబ్బంది, అదనపు సిబ్బందితో ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి పర్యవేక్షణలో ఏ.ఈ సూర్య ప్రకాష్ ఆధ్వర్యంలో సిబ్బంది వెంకటాపురం సబ్ స్టేషన్లో మరమ్మత్తు పనులలో నిమగ్నమయ్యారు. రాత్రి పొద్దుపోయే వరకు కూడా 8:30 గంటల వరకు కూడా విద్యుత్ సరఫరా పునరు ద్ధరించలేదు. త్వరితగతిన విద్యుత్తు మరమ్మతులు పూర్తి చేసి వినియోగదారులకు విద్యుత్ అందించే విధంగా రాత్రి సమయంలో కూడా శ్రమించి తమ సిబ్బంది మరమ్మత్తులు పూర్తిచేసి విద్యుత్ అందిస్తామని వెంకటాపురం ఏడిఈ ఆకిటి స్వామి రెడ్డి మీడియాకు తెలిపారు.