మిర్చి రైతులకు నాబార్డ్ ద్వారా శిక్షణా కార్యక్రమాలు
– వికాస్ అగ్రి ఫౌండేషన్ సేవలు అభినందనీయం
-నాబార్డ్ డిడియం రవి చైతన్య
మంగపేట,తెలంగాణజ్యోతి : మిర్చి రైతుల కోసం రైతు శిక్షణ కార్యక్రమాలు విజ్ఞాన యాత్రలు నిర్వహిస్తామని జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు నాబార్డు వరంగల్ క్లస్టర్ ములుగు జిల్లా డెవల ప్మెంట్ మేనేజర్ తంగా రవి చైతన్య అన్నారు. శనివారం ఆయన జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి తో కలిసి మండలంలోని బోరు నరసాపు రం అకినేపల్లి మల్లారం గ్రామాల్లో పర్యటించారు మంగపే ట మండలం బోరు నరసాపురం గ్రామంలో స్థానిక రైతుల తో కలిసి మిర్చి క్షేత్రాలను పరిశీలించిన అనంతరం ఆయ న మాట్లాడుతూ ఎర్ర బంగారం విస్తీర్ణం రోజు రోజుకు పెరుగుతోందని మిర్చిలో నాణ్యతా ప్రమాణాల పెంపు ఎగుమతికి అనువైన సాగు పద్ధతులను రైతులు పాటిం చేందుకు అవసరమైన శిక్షణ కార్యక్రమాలు రైతు విజ్ఞాన యాత్రలు త్వరలో నిర్వహిస్తామని అంతేకాకుండా మహిళా రైతులు మరియు మహిళా వ్యవసాయ కూలీల కు ఎల్ ఈ డి పి ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. గత సంవత్సరం వికాస్ అగ్రి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమలాపురం బోరు నరసాపురం అకినేపల్లి మల్లారం గ్రామాల నుండి ఎంపిక చేసిన మిర్చి రైతులను జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం లో రైతు విజ్ఞాన యాత్ర క్యాట్ నిర్వహించి రైతులకు శిక్షణ ఇప్పించామని ఆ రైతు శిక్షణ ఫలితాల విశ్లేషణ కోసం ఈరోజు తాను మిర్చి క్షేత్రాలను పరిశీలించేందుకు వచ్చినట్లు తెలిపారు. వ్యవసాయ రంగంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వికాస్ అగ్రి ఫౌండేషన్ ద్వారా ఎల్ఈడి పి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించటంతో పాటు వందమందికి పైగా రైతులను విజ్ఞాన యాత్రకు పంపిం చమన్నట్లు తెలిపారు. వికాస్ అగ్రి పౌండేషన్ చైర్మన్ మరియు జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ మెంబర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి మాట్లాడుతూ మిర్చి రైతులకు సాంకేతిక శిక్షణ కార్యక్రమాలతో పాటు రాయితీపై ఉపకరణాలు అందజేసే విధంగా ప్రత్యేక ప్రాజెక్టు అమలు చేయాలని కోరారు. అంతేకాకుండా మంగపేట మండలంలో గత 30 సంవత్సరాలుగా వరి విత్తన ఉత్పత్తి పెద్ద ఎత్తున చేస్తు న్నారని వరి విత్తన రైతుల కోసం నాబార్డ్ నుండి ప్రత్యేక ప్రాజెక్టును మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వన సమాఖ్య ప్రాజెక్టు కో ఆర్డినేటర్ జి రమేష్ వికాస్ అగ్రి ఫౌండేషన్ డైరెక్టర్లు నేలపట్ల వసంత రెడ్డి చెట్టిపల్లి తిరుపతిరావు మరియు ఆయా గ్రామాల స్థానిక రైతులు పాల్గొన్నారు.