మల్లంపల్లి కెనాల్ వద్ద ట్రాఫిక్ జామ్
ములుగు, జనవరి 4, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం కెనాల్ వద్ద తీవ్ర ట్రాఫిక్ జామ్ నెలకొంది. మేడారం జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఉన్న వందలాది వాహనాలు ఒకేసారి చేరడంతో జాతీయ రహదారి కిక్కిరిసిపోయింది. కెనాల్‌పై ఉన్న ఇరుకైన రహదారి కారణంగా వాహనాలు ముందుకు కదలలేక నిలిచిపోయాయి. పందికుంట బస్సు స్టేజ్ నుంచి సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాల బారులు ఏర్పడ్డాయి. వాహనం వెనుక వాహనం నత్తనడకన సాగుతుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఈ స్థాయిలో పరిస్థితి ఉంటే, జాతర ప్రధాన రోజుల్లో ట్రాఫిక్ మరింత తీవ్రంగా మారుతుందేమోనని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.






