ప్రారంభానికి నోచుకోని పల్లె దవాఖాన
తెలంగాణ జ్యోతి, నర్సంపేట : ఖానాపూర్ మండలం అశోక్ నగర్ గ్రామంలో గత కొన్ని రోజుల క్రితం పేద ప్రజల కొరకు మెరుగైన వైద్యం అందుబాటులో ఉండాలని గత ప్రభుత్వం ఆయుష్మాన్ ఆరోగ్యం మందిర్ పల్లె దవాఖాన ను నిర్మించారు. నిర్మాణం పూర్తయి నెలలు గడుస్తున్న ఇప్పటి వరకు ప్రారంభానికి నోచుకోలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రస్తుత ప్రభుత్వం చొరవ తీసుకొని పేద ప్రజల కొరకు నిర్మించిన పల్లె దావకలను అందుబాటు లోకి తీసుకురావాలని పేద ప్రజలు వేడుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామంలో ఉండ బడే ఆర్ఎంపీ డాక్టర్లు వైద్యం చేయకూడదని ఒకపక్క మెడికల్ డిఎం హెచ్ఓ. ప్రభుత్వ వైద్య అధికారులు ఆదేశాలు జారీచేశారు. గ్రామంలో నివసించే పేద ప్రజలకు వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పల్లె దవాఖానను ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కోరుతున్నారు.