తడిసి ముద్దయిన ప్రతి ఒక్క వడ్ల గింజను కొనుగోలు చేయాలి

Written by telangana jyothi

Published on:

తడిసి ముద్దయిన ప్రతి ఒక్క వడ్ల గింజను కొనుగోలు చేయాలి

– తరుగు లేకుండా ప్రతి క్వింటాకు 500 రూ. బోనస్ తో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలి.

– ఎస్టి మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్

తెలంగాణ జ్యోతి, ములుగు ప్రతినిధి : అకాల వర్షాలతో తడిసి ముద్దయిన ప్రతి వడ్ల గింజను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ఎస్టీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత వారం రోజుల నుండి ములుగు జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలతో పంట నష్టం అయిన ప్రతి రైతును రాష్ట్ర ప్రభుత్వం ఆదుకో వాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాలలో వర్షం వచ్చినా కూడా వడ్లు తడప కుండా తార్పాలిన్ పట్టాలు ప్రతి రైతుకు అందజేయాలని డిమాండ్ చేశారు. ఫసల్ బీమా యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కోడ్ అనంతరం అమలు చేయాలన్నారు. తరుగు లేకుండా వడ్లను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తరుగు,  తాళు పేరుతో ప్రతి రైతు దగ్గర 5 నుండి 10 కిలోల వరకు మధ్యలో ఉన్న మధ్యవర్తులు మిల్లర్లు తీస్తున్నారని వారిపై చట్టపర మైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు రైతులకు ప్రతి క్వింటాకు 500 రూపాయలు బోనస్ గా వడ్లు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రైతులను చిన్నచూపు చూడడం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు. రైతు భరోసా పేరుతో రైతులకు 15 వేల రూ. ఇస్తానని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు దాటినా కూడా నేటికీ రైతు భరోసా లేదని అన్నారు. రైతులకు రుణమాఫీ చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మలేక పోతున్నారన్నారు. కాంగ్రెస్ ను నమ్ముకుంటే ఉన్నది అమ్ము కోవాలన్నారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక పార్లమెంటు స్థానా లను కైవసం చేసుకోబోతుందని అన్నారు. రైతులకు నష్ట పరిహాలు అన్ని కట్టించని ఎడల రాబోయే రోజులలో ధర్నా కార్యక్రమాల్లో నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడలు వంచి అయినా సరే రైతులకు మేలు చేసే విధంగా బిజెపి ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు.

Leave a comment