ఇప్పలగూడెం హత్య కేసులో ముగ్గురు నిందితుల అరెస్ట్
కాటారం, తెలంగాణ జ్యోతి ప్రతినిధి : జయశంకర్ భూపాల పల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని ఇప్పలగూడెం గ్రామం లో ఇటీవల భూ తగాదాతో ఒకరి హత్యకు సంబంధించిన వివరాలను కాటారం సిఐ నాగార్జున రావు, ఎస్సై అభినవ్ వెల్లడించారు. కాటారం శివారులో గల లావుని పట్టా భూమి విషయమై గత కొన్ని సంవత్సరాలుగా తగాదా జరుగుతుండగా, స్థానిక పెద్దమనుషుల ఆధ్వర్యంలో పలుమార్లు పంచాయితీలు నిర్వహించారు. అయినప్పటికీ వ్యక్తిగత కక్షలతో ఇప్పల గూడెం గ్రామానికి చెందిన దొంగిలి బుచ్చయ్య (65), సోదారి పవన్ (22), సోదారి లింగయ్య (49), శోభ (40) మీరు ముగ్గురు ఇప్పల గూడెం గ్రామానికి చెందినవారు. వీరు ముగ్గురు దొంగిరి బుచ్చయ్యపై కర్రతో దాడి చేయగా అపస్మారక స్థితిలో ఉండగా, ఆసుపత్రికి తరలించగా మార్గ మధ్యలోనే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారని పోలీసులు వెల్లడించారు. మృతుడి భార్య దొంగిరి సారమ్మ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. సోమవారం కాటారం ట్రైబల్ స్కూల్ వద్ద ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారించగా, నేరం ఒప్పుకొని సంఘటనకు సంబంధిం చిన వివరాలను వివరించారని పోలీసులు తెలిపారు. భూ సమస్యల విషయంలో ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకో వద్దని పోలీసులు హెచ్చరించారు. రెవిన్యూ శాఖ, పోలీసు వారిని సంప్రదించి సామరస్య పూర్వకంగా సమస్యలను పరిష్క రించుకోవాలని కాటారం సీఐ నాగార్జున రావు, ఎస్సై అభినవ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.