నూతన సంవత్సర స్వాగత సంబరాలు షురూ…

నూతన సంవత్సర స్వాగత సంబరాలు షురూ...

నూతన సంవత్సర స్వాగత సంబరాలు షురూ…

– ముత్యాల ముగ్గులు, రంగవల్లులు. 

– కేక్ ,బిర్యానీ, మిఠాయి దుకాణాలు సిద్ధం. 

     వెంకటాపురం నూగూరు, తెలంగాణ జ్యోతి : నూతన సంవత్సరానికి స్వాగతం పలికే సమయం దగ్గర పడుతున్న కొద్ది, ఏజెన్సీ ప్రాంతమైన వెంకటాపురం, వాజేడు మండలంలో స్వాగత సన్నాహాలకు అశేష ప్రజానీకం, యువత ఉర్రూత లూగుతుంది. ఈ మేరకు వ్యాపారులు వెంకటాపురం మార్కెట్ సెంటర్ లో రంగు రంగుల ముగ్గులకు ఉపయోగించే రంగులను విక్రయిస్తు న్నారు.అంతేకాక కేక్ కటింగ్ షాపుల వద్ద ప్రత్యేక ఏర్పాట్లు నిర్వ హించారు. స్వీట్ల దుకాణాల వద్ద గుమ గుమలాడే మిఠాయిలు, తినుబండారాలతో సోమవారం నుండే ప్రజలకు విక్రయాలు జరుపుతున్నారు.నాన్ వెజ్ బిర్యానీ పాయింట్లు, చికెన్ జాయిం ట్ పీసులు, గోదావరీ ఫిష్ ఫ్రై, ఇతర ఐటమ్స్ తో ఆయా వ్యాపారులు బిర్యాని పాయింట్ల వద్ద, ప్లెక్సీలతో బోర్డులను ఏర్పాటుచేసి కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది. వర్తక, వాణిజ్య సంస్థలు వస్త్ర దుకాణాలు, బంగారపు దుకాణాలు, స్వర్ణభరణ దుకాణాలు,కిరణా షాపులు కొనుగోలుదాలతో కిటకిటలాడు తున్నాయి. పిండిగిర్నీల వద్ద పిండి వంటల నిమిత్తం అవసర మయ్యే పిండి మర పట్టించుకునేందుకు, గృహిణులు క్యూలు కట్టారు. అయితే సోమవారం నుండి ఇల్లు, వాకిళ్లను శుభ్రం చేసుకొని, ముత్యాల ముగ్గులు రంగవల్లులతో నూతన సంవత్స రంకు స్వాగతం పలికేందుకు ఆబాల గోపాలం హర్షాతీరేఖలతో, బంధు మిత్రులతో బిజీ, బిజీగా పరుగు లాంటి నడకలతో, వాహనాలలో చెక్కర్లు కొడుతున్నారు. అయితే పోలీస్ శాఖ మాత్రం మద్యం సేవించి వాహనాలు నడపరాదని, న్యూ ఇయర్ సంబరాల్లో పౌరులకు ఆటంకం కలిగించే వారిపై కేసులు నమోదు చేస్తామని, తల్లిదండ్రులు ఈ మేరకు వారి, వారి పిల్లలను ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించే విధంగా చూసుకోవాలని, పోలీస్ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. నూతన సంవత్సర సంబరాలు సందర్భంగా సోమవారం నుండే వ్యవసాయ పనులకు అంతరా యం ఏర్పడింది. ఇంటింటా పిండివంటల గుమ, గుమ, గుమల తో గ్రామాల్లో హ్యాపీ న్యూ ఇయర్ సందడి సంతరించుకున్నది.

Tj news

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a comment