భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

On: January 18, 2026 4:12 PM

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై అసత్యపు ఆరోపణలు మానుకోవాలి

– రెండేళ్ల సమయంలో రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టాం

– మరో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకి జీవో లు తీసుకొచ్చాం

– అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు నేతల తప్పుడు ఆరోపణలు

– రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం.. అన్ని వార్డుల్లో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం

– భూపాలపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

కాటారం, జనవరి 18,(తెలంగాణ జ్యోతి): భూపాలపల్లి మున్సిపాలిటీ అభివృద్ధిపై కొందరు కావాలని అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని,వాటిని తక్షణమే మానుకోవాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పష్టం చేశారు.ఆదివారం భూపాలపల్లిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, పట్టణ అధ్యక్షుడు ఇస్లావత్ దేవన్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు..మరికొంత మంది ముఖ్య నేతలు మరియు మాజీ కౌన్సిలర్లతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… గడిచిన రెండేళ్ల సమయంలో భూపాలపల్లి మున్సిపాలిటీ లోని అన్ని వార్డుల్లో సుమారు రూ.350 కోట్లకు పైగా నిధులతో పలు అభివృద్ది పనులు చేపట్టామని అన్నారు. అదేవిధంగా, మరో రూ.150 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకి జీవో లు కూడా రెండు రోజుల కిందట తీసుకొచ్చామని తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే కొందరు నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో పట్టణ ప్రజలు మీకు బుద్ధి చెప్పి, 30 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించి, అత్యధిక మెజారిటీ ఇచ్చి గెలిపించుకోవడం ఖాయమన్నారు. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర సౌకర్యాలకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిందని తెలిపారు. ఇప్పటికే అనేక పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం పనిచేస్తుంటే, మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధి కోసం కొందరు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఎమ్మెల్యే విమర్శించారు. అభివృద్ధి పనులపై ఎవరికైనా సందేహాలు ఉంటే అధికారికంగా వివరాలు తెలుసుకోవచ్చని, కానీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. భూపాలపల్లి పట్టణాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తమదేనని, ప్రజలు రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు ఓట్లేసి గెలిపించుకోవాలని కోరారు.

Join WhatsApp

Join Now

Related Post

Related Post

Leave a Comment

error: Content is protected !!