తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలు
– చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్
తెలంగాణ జ్యోతి, కాటారం ప్రతినిధి : వేసవిలో తాటి ముంజలతో ఎన్నో ప్రయోజనాలున్నాయని సామాజిక కార్యకర్త చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాటి ముంజల్లో విటమి న్స్ ఐరన్, కాల్షియం, జింక్, ఫాస్ఫరస్, పొటాషియం, థయామిన్, రోబో ప్లేవిస్, నియాసిస్, బీ కాంప్లెక్స్ వంటివి ఉంటాయని అన్నారు. అనారోగ్య సమస్యల నుంచి కాపాడుతాయనీ అన్నారు. అలాగే తాటి ముంజల్లో ఉండే నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల వడదెబ్బ తగలకుండా శరీరాన్ని చల్లబరుస్తాయనీ వివరించారు. అంతేకాకుండా డీహైడ్రేషన్‌కు గురికాకుండా చేస్తాయన్నారు.అందుకే తాటి ముంజలతో ఎన్నో ప్రయోజ నాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారనీ సామాజిక కార్యకర్త వెంకటేశ్వర్లు గౌడ్ అన్నారు.