నూతన వాటర్ ప్లాంట్ పనులకు శ్రీకారం
గోవిందరావుపేట, జనవరి 12, తెలంగాణ జ్యోతి : మండల పరిధి గాంధీనగర్ లో యునైటెడ్ వే హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్మిస్తున్న నూతన వాటర్ ప్లాంట్ పనులను గ్రామ సర్పంచ్ బానోత్ నిర్మల వెంకన్న సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ నిర్మల వెంకన్న మాట్లాడుతూ ఇప్పటివరకు గ్రామస్థులు మినరల్ వాటర్ కోసం సుమారు నాలుగు కిలోమీటర్ల దూరం పక్క గ్రామాలకు వెళ్లాల్సి వచ్చేదని, ఈ కొత్త వాటర్ ప్లాంట్ నిర్మాణంతో ఆ సమస్య పూర్తిగా తొలగి గ్రామంలోనే తక్కువ ధరకు స్వచ్ఛమైన మంచినీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఈ అవకాశాన్ని కల్పించిన యునైటెడ్ వే హైదరాబాద్ స్వచ్ఛంద సంస్థ మేనేజర్ రాములు గారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే వాటర్ ప్లాంట్ మంజూరుకు సహకరించిన రాష్ట్ర మంత్రి సీతక్కకు, జిల్లా కలెక్టర్ దివాకర్ టిఎస్‌కు గాంధీనగర్ గ్రామపంచాయతీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వల్లపు మహేష్, పంచాయతీ కార్యదర్శి భారతి, వార్డు సభ్యులు కూరాకుల సురేష్, లాకావత్ ఈర్య, భూక్య మంజుల రవి, రామావత్ సంధ్య, బిక్షపతి, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.






