మేడారం జాతర విధుల్లో మాస్కుల వినియోగం తప్పనిసరి
సీపీ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్/హనుమకొండ, జనవరి 24 (తెలంగాణ జ్యోతి): మేడారం జాతర విధుల్లో శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది తప్పనిసరిగా మాస్కులు ధరించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సూచించారు. హనుమకొండ సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ ద్వారా మేడారం జాతర విధుల్లో పాల్గొంటున్న పోలీసు, ట్రాఫిక్ పోలీసు సిబ్బంది అవసరాల కోసం 50 వేల మాస్కులను సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ హనుమకొండ ఫార్మసీ ఆఫీసర్ ఉప్పు భాస్కరరావు సీపీకి అందజేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ జాతర విధుల్లో పాల్గొనే సిబ్బంది ఆరోగ్య పరిరక్షణకు మాస్కులు అందించిన సెంట్రల్ మెడిసిన్ స్టోర్స్ అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు అంకిత్ కుమార్, దార కవిత, అడిషనల్ డీసీపీలు ప్రభాకర్, బాలస్వామి, ఏసీపీలు సదయ్య, సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, జానీ, నర్సింలు, సురేందర్, సీఐలు రాఘవేందర్, సీతారెడ్డి, సుజాత, వెంకన్న, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు.






