వాడబలిజల ఐక్యతే మహా బలం
– బహిరంగ సభలో డర్రా దామోదర్ పిలుపు
వెంకటాపురం, డిసెంబర్ 30, తెలంగాణ జ్యోతి : మహారాష్ట్ర గచ్చిరోలి జిల్లా సిరివంచ మండలంలో మంగళవారం నిర్వహించిన బహిరంగ సభకు ములుగు జిల్లా వెంకటాపురం ప్రాంతానికి చెందిన తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర, జిల్లా, మండల కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్ మాట్లాడుతూ, తెలంగాణ–మహారాష్ట్ర ప్రాంతాల మధ్య వాడబలిజలకు చారిత్రక అనుబంధం ఉందని గుర్తు చేశారు. మూడు రాష్ట్రాల్లో ఉన్న వాడబలిజలంతా ఐక్యతగా ఉంటే గొప్ప బలంగా మారుతామని, విడిపోయితే బలహీనపడతామని పేర్కొన్నారు. కష్టకాలాల్లో ఐక్యతే ధైర్యాన్నిస్తుందని, విజయానికి మార్గం చూపుతుందని అన్నారు. ఎటువంటి సమస్య వచ్చినా వాడబలిజ సేవా సంఘం తరఫున ముందుండి పోరాడుతామని ఆయన హామీ ఇచ్చారు. సభా ప్రాంగణంలో చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. “వాడబలిజల ఐక్యత వర్ధిల్లాలి జై వాడబలిజ నినాదాలతో సభ ఉత్సాహంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో వాడబలిజ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు డర్రా దామోదర్‌తో పాటు అధికార ప్రతినిధి తోట మల్లికార్జునరావు, ఉపాధ్యక్షులు గార ఆనంద్, వ్యవస్థాపకులు డేనార్జన్, సీనియర్ నాయకులు తోట ప్రశాంత్, అల్లిసూరిబాబు, కొప్పుల రఘుపతిరావు, ములుగు జిల్లా ఉపాధ్యక్షులు గార తిరుపతి, మండల అధ్యక్షులు గార నాగార్జునరావు, వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్, మండల అధికార ప్రతినిధి బొల్లె నారాయణ, కోశాధికారి పానేం సురేష్, గౌరారపు రాంప్రసాద్, గార సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.





