కేసీఆర్‌ను కలిసిన టిఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షులు
లక్ష్మణ్‌బాబు – శ్రీలత దంపతులను అభినందించిన కెసిఆర్
ఏటూరునాగారం, డిసెంబర్ 31, తెలంగాణ జ్యోతి: ములుగు జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు, ఏటూరునాగారం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌గా బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి కాకులమర్రి శ్రీలత భారీ మెజార్టీతో గెలుపొందిన సందర్భంగా హైదరాబాదులోని నందినివాసంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజార్టీతో శ్రీలతను గెలిపించినందుకు లక్ష్మణ్‌బాబును, శ్రీలతను కేసీఆర్ ఆప్యాయంగా అభినందించి, ఏటూరునాగారం ప్రాంతంలో ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం లక్ష్మణ్‌బాబు, శ్రీలతలు కేసీఆర్‌తో పాటు ఆయన సతీమణి శోభమ్మను కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ భేటీలో ములుగు నియోజకవర్గానికి సంబంధించిన వివిధ సమస్యలు, అభివృద్ధి అంశాలను లక్ష్మణ్‌బాబు కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా, ములుగు జిల్లాలో బీఆర్‌ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసి రాబోయే రోజుల్లో గులాబీ జెండాను మరింత ఎగరవేయాలని లక్ష్మణ్‌బాబుకు కేసీఆర్ సూచించారు.






