19న ఆదివాసి తెగల సమ్మేళనం విజయవంతం చేయాలి
జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య పిలుపు
తాడ్వాయి, జనవరి 07 (తెలంగాణ జ్యోతి): ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో జనవరి 11న నిర్వహించాలనుకున్న ఆదివాసి తెగల సమ్మేళనం అనివార్య కారణాల వల్ల జనవరి 19వ తేదీకి మారిందని జాతీయ కన్వీనర్ రమణాల లక్ష్మయ్య తెలిపారు. ఈ సమ్మేళనానికి జిల్లాలోని ఆదివాసి ప్రజలు, మహిళలు, విద్యార్థినీ-విద్యార్థులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో తుడుం దెబ్బ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాక శ్రావణ్ కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి పొడేం బాబు, ఏ యస్ పి జాతీయ అధ్యక్షుడు దాట్ల నాగేశ్వరరావు, తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు ఈసం సుధాకర్, కోయ దొరల సంఘం జిల్లా అధ్యక్షుడు బుగ్గ బాబు, ఏ యస్ పి రాష్ట్ర అధ్యక్షుడు ఊకే శంకర్, తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షుడు చందా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి కాపుల సమ్మయ్య, ఆదివాసి మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమురం లక్ష్మి కాంత, జిల్లా అధ్యక్షురాలు పోశెట్టి అనసూయ, ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ అరేం లచ్చుపటేల్, మాజీ సర్పంచ్ ఇర్ప సునిల్ తదితరులు పాల్గొన్నారు.





