ప్రశాంతంగా పూర్తయిన మూడో విడత ఎన్నికలు
– జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్
వెంకటాపురం నూగూరు, డిసెంబర్ 17, తెలంగాణ జ్యోతి : ములుగు జిల్లాలో నిర్వహించిన మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకన్ తెలిపారు. ఎన్నికల సందర్భంగా పటిష్టమైన పోలీస్ భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు చెప్పారు. బుధవారం వెంకటాపురం, వాజేడు మండలాల్లో ఎన్నికల సరళిని పరిశీలించిన ఎస్పీ, వెంకటాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్‌లను సందర్శించారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరిగిందని, మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎటునాగారం ఏఎస్పీ, ఓఎస్డీ, స్థానిక సీఐ ముత్యం రమేష్, ఎస్‌ఐ కె. తిరుపతిరావు, ప్రత్యేక పోలీస్ బృందాలు పాల్గొన్నారు.






