శివాలయం ప్రధాన పూజారిని సన్మానించిన ఆలయ కమిటీ.
వెంకటాపురం నూగూరు తెలంగాణ జ్యోతి ప్రతినిధి : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల కేంద్రంలో వేంచేసి ఉన్న శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి దేవాలయం ప్రధాన అర్చకులు పురోహితులు అవసరాల రామశర్మ జన్మదినం సందర్భంగా ఆల య కమిటీ భక్తులు శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సన్మానిం చారు. గురువారం స్వామివారి ఆలయంలో ఆలయ పూజారి అవ సరాల రామశర్మకు పట్టు శాలువతో సన్మానించి, బహుమతిని అందజేసారు. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరేళ్లు జరుపుకోవాలని, స్వామివారికి భక్తులకు సేవలం దించాలని, ఈ సందర్భంగా ఆలయ కమిటీ ,మరయు భక్తులు ఓం నమశ్శి వాయ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు ధనపనేని వెంకటేశ్వర్లు, గ్రామీనా వైద్యులు పిల్లల జయ సింహ, కలకోట సంతోష్ కుమార్, శెట్టి సునీల్, వేల్పూరి చక్రధర్ రావు, కొమ్మనాపల్లి వెంకటేశ్వర్లు, నామని సూరిబాబు స్వామి, దన పనేని నాగరాజు, వేల్పూరి సరిత, జానకమ్మ, నంద్యాల సావిత్రి తదితర భక్తులు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
1 thought on “శివాలయం ప్రధాన పూజారిని సన్మానించిన ఆలయ కమిటీ. ”